Saturday, 4 January 2020

పరలోక రాజ్యము స్వతంత్రించుకొనే సులువైన మార్గము !!


యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.              యోహాను -  14:6

శిష్యులు వారికి మార్గము తెలియదన్నప్పుడు.. యేసు నేనే మార్గమును అని వారితో చెప్పెను. ఎందుకంటే పరలోకములో ప్రవేశించడానికి ఆయన మార్గమునై ఉన్నాడు. ఆయన సిలువ మరణం ద్వారా మన పాపములు క్షమించబడ్డాయి... అంతే కాదు దేవుని దృష్టిలో మనము నీతిమంతులుగా యెంచబడ్డాము. విశ్వాసము వలన మనము పొందే యేసు నీతి మనకు పరలోకం వెళ్ళడానికి అధికార పత్రమవుతోంది. 

ఆయన సత్యమైన దేవుడు.. ఆయనయందు విశ్వాసముంచి ఆయన బోధను ఒప్పుకొని మనము రక్షణను పొందుకొని, అజ్ఞానము నుండి, పాపమునుడి విడుదల పొందుకొంటాము

ఆయనలో జీవమున్నది. ఆయన నిరంతరం జీవించు వాడు.. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యేసు  మాత్రమే లోకమునకు రక్షకుడు. యేసునందు విశ్వాసముంచుట వలన మాత్రమే మనము తండ్రి యొద్దకు రాగము. ఆయన ఇంటిలో నివసింపగలము.  

 నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పగలిగిన ఏకైక దేవుడు ఒక క్రీస్తు మాత్రమే ఈయన మాత్రమే మనుస్యులకు  రక్షణ, నిత్యమార్గము ఇవ్వగలడు, వారిని పరలోకమునకు నడిపించగలడు.  మార్గము, సత్యము, జీవమునై ఉన్న క్రీస్తును ఈ రోజు నుంచే వెంబడిద్దాము.. పరలోక రాజ్యమునకు మార్గము సరాళము చేసుకుందాము.  

ప్రార్ధన :

పరిశుద్ధుడవైన మా ప్రియా పరలోకపు తండ్రి.. నీ ప్రియా కుమారుని మా కొరకు ఈ భూలోకమునకు పంపించి సర్వమానవాళి పాపముల నుండి విడిపించుట  కొరకు తన ప్రాణము బలిగా అర్పించి.. మమ్మును రక్షించినందుకు  మీకు వందనాలు.. దేవా.. నీవిచ్చిన రక్షణను, నిత్యమార్గములో జీవిస్తూ.. మార్గము, సత్యము, జీవము అయిన యేసు దివ్యమైన నామములో ఈ ప్రార్ధన సమర్పించు చున్నాము మా పరమ తండ్రీ... 

ఆమెన్....  ఆమెన్....  ఆమెన్ .... 

దేవుడు నిత్యము మిమ్మును కృపాక్షేమములతో నింపును గాకా!!!

No comments:

Post a Comment

 2025 కి గుడ్ బై చెప్పి...  ఇ క నూతన ఉత్సాహముతో  2026 లోకి  అడుగు వేద్దాం సంవత్సరాంతంలో (Year-end) మనం గడిచిన రోజులను నెమరువేసుకుంటూ, కొత్త ...