Saturday, 25 January 2020
Wednesday, 22 January 2020
నీ ప్రార్థనలకు ప్రతిఫలం..
నీవు లేచి రేయి మొదటి జామున మొఱ్ఱపెట్టుము నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయ మును కుమ్మరించుము - విలాప 2:19
విక్టోరియా మహారాణి 64 సంవత్సరములు ఇంగ్లాడు దేశాన్ని పరిపాలించింది అంటే కారణం ఆమె ప్రార్ధన. ఒకదినమున ఆమె ప్యాలెస్ లో ఒంటరిగా నిద్రపోతున్నప్పుడు ఎవరో వచ్చి తలుపుతట్టి అమ్మ మన రాజ్యమును ఏలే మహారాజుగారు (విలియం-IV) చనిపోయారు.. ఇకనుండి మీరే ఈ దేశానికి రాణి అని అనగానే ఆ యవ్వనస్థురాలు వెంటనే తన మోకాళ్లపై పడి ఆకాశమువైపు కన్నులెత్తి దేవా.. ఈ దేశమును ఎలా పరిపాలించాలో తగిన జ్ఞానమును, వివేకమును నాకు దయచేయుమని యంతో భారముతో ప్రార్ధన చేసేనంట. మనదేశము నుండి ఒక ప్రముఖుడు విక్టోరియా మహారాణిని చూసి అమ్మ మీరు ఇంత గొప్పగా దేశాన్ని పరిపాలించుటకు గల రహస్యమేమని ప్రశ్నించగా ఆమె తన టేబుల్ పై ఉన్న ఒక పుస్తకమును చూపించి.. ఇదే నా విజయ రహస్యము అని బదులిచ్చింది. ఆ పుస్తకమే బైబిల్. ఆమె రాణి అయినప్పటికీ బైబిల్ ధ్యానించుటయందును, ప్రార్ధించుటయందును, దేవునియందు భయభక్తులు కలిగి యంతో శ్రద్ధ కలిగి జీవించింది. కాబట్టి దేవుడు ఆమెను ఆమె రాజ్యమును దీవించెను. రాణిని బట్టి ఆదేశపు ప్రజలను దీవించెను.
ప్రియ నేస్తమా... యోబు తన పిల్లల నిమిత్తం అరుణోదయమునే దేవుని సన్నిధిలో దహన బలులను అర్పిచేవాడు. ప్రార్థనలతో దినదినము కంచెవేసేవాడు. కాబట్టి నీవు లేచి రేయి మొదటి జామున మొఱ్ఱపెట్టుము. నీ ప్రార్ధనను బట్టి నీ కుటుంబం కట్టబడుతుంది, నీ పిల్లలు దీవించబడుదురు.
ప్రార్ధన:
పరిశుద్దుడవైన తండ్రి ప్రేమకలిగిన ప్రభువా.. విక్టోరియా మహారాణి చేసిన ప్రార్థనలను భట్టి దీవించి 64 సంవత్సరములు గొప్పగా పరిపాలించే భాగ్యాన్ని దయచేసావు... ప్రభువా.. మేముకూడా.. రేయి మొదటి జామున మొఱ్ఱపెట్టి మాకుటుంబములపైనా, మా పిల్లలపైనా దినదినము కంచె వేసుకొని తద్వారా నీ దీవెనలను పొందుకొనే భాగ్యమును దయచేయమని.. మా ప్రియా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్ధన సమర్పిస్తున్నాము మా పరమ తండ్రీ... ఆమెన్
విక్టోరియా మహారాణి 64 సంవత్సరములు ఇంగ్లాడు దేశాన్ని పరిపాలించింది అంటే కారణం ఆమె ప్రార్ధన. ఒకదినమున ఆమె ప్యాలెస్ లో ఒంటరిగా నిద్రపోతున్నప్పుడు ఎవరో వచ్చి తలుపుతట్టి అమ్మ మన రాజ్యమును ఏలే మహారాజుగారు (విలియం-IV) చనిపోయారు.. ఇకనుండి మీరే ఈ దేశానికి రాణి అని అనగానే ఆ యవ్వనస్థురాలు వెంటనే తన మోకాళ్లపై పడి ఆకాశమువైపు కన్నులెత్తి దేవా.. ఈ దేశమును ఎలా పరిపాలించాలో తగిన జ్ఞానమును, వివేకమును నాకు దయచేయుమని యంతో భారముతో ప్రార్ధన చేసేనంట. మనదేశము నుండి ఒక ప్రముఖుడు విక్టోరియా మహారాణిని చూసి అమ్మ మీరు ఇంత గొప్పగా దేశాన్ని పరిపాలించుటకు గల రహస్యమేమని ప్రశ్నించగా ఆమె తన టేబుల్ పై ఉన్న ఒక పుస్తకమును చూపించి.. ఇదే నా విజయ రహస్యము అని బదులిచ్చింది. ఆ పుస్తకమే బైబిల్. ఆమె రాణి అయినప్పటికీ బైబిల్ ధ్యానించుటయందును, ప్రార్ధించుటయందును, దేవునియందు భయభక్తులు కలిగి యంతో శ్రద్ధ కలిగి జీవించింది. కాబట్టి దేవుడు ఆమెను ఆమె రాజ్యమును దీవించెను. రాణిని బట్టి ఆదేశపు ప్రజలను దీవించెను.
ప్రియ నేస్తమా... యోబు తన పిల్లల నిమిత్తం అరుణోదయమునే దేవుని సన్నిధిలో దహన బలులను అర్పిచేవాడు. ప్రార్థనలతో దినదినము కంచెవేసేవాడు. కాబట్టి నీవు లేచి రేయి మొదటి జామున మొఱ్ఱపెట్టుము. నీ ప్రార్ధనను బట్టి నీ కుటుంబం కట్టబడుతుంది, నీ పిల్లలు దీవించబడుదురు.
ప్రార్ధన:
పరిశుద్దుడవైన తండ్రి ప్రేమకలిగిన ప్రభువా.. విక్టోరియా మహారాణి చేసిన ప్రార్థనలను భట్టి దీవించి 64 సంవత్సరములు గొప్పగా పరిపాలించే భాగ్యాన్ని దయచేసావు... ప్రభువా.. మేముకూడా.. రేయి మొదటి జామున మొఱ్ఱపెట్టి మాకుటుంబములపైనా, మా పిల్లలపైనా దినదినము కంచె వేసుకొని తద్వారా నీ దీవెనలను పొందుకొనే భాగ్యమును దయచేయమని.. మా ప్రియా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్ధన సమర్పిస్తున్నాము మా పరమ తండ్రీ... ఆమెన్
Monday, 20 January 2020
కృతజ్ఞత కలిగి ఉన్నావా...?
నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు.- కీర్తనలు 103:2,3
ప్రార్ధన చేసిన తరువాతనే భోజనం చేయాలనీ తన కుమార్తెకు చెప్పేది. కానీ ఆ అమ్మాయి ఎప్పుడు వాళ్ళమ్మ చెప్పే మాటలను లక్ష్యపెట్టక, భోజనం చేసేటప్పుడు ఆతృతగా భోజనము చేసేది. ఒక రోజు భిక్షగత్తె బిక్షాటన చేస్తూ వారి ఇంటివరకు వచ్చిన్నప్పుడు ఆమెను పిలచి భోజనం పెట్టెను . ఆమె గబగబా తిని తుడుచుకొంటూ వెళ్ళిపోయింది. ఇది చూసి ఆ అమ్మాయి అమ్మా కనీసం కృతజ్ఞత కూడా లేకుండా అలా వెల్లిపొయింది ఏంటి? అని అడిగినప్పుడు.. నీవు కూడా అదే చేస్తున్నావు కదా.. కడుపునిండా భోజనం పెడుతున్న దేవునికి ఏనాడైనా స్తుతులు చెల్లించావా? కృతజ్ఞత లేని వాళ్ళను చూసి దేవుడు ఎంతగా బాధపడతాడో నీకు తెలియడానికి ఆ భిక్షగత్తెను పిలచి భోజనం తిని కృతజ్ఞత చెప్పకుండా వెళ్లిపొమ్మని చెప్పాను అని చెప్పింది. సత్యమును గ్రహించిన ఆకుమార్తె ఆరోజునుండి దేవునికి స్తుతులు చెల్లించిన తరువాతే భోజనం చేసేది.
ప్రియా నేస్తమా... దేవుడు మనకు ఇచ్చిన దానిని బట్టి ఆయన యెడల కృతజ్ఞత కలిగి జీవించే వారీగా ఉన్నావా.. ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకొనుము. దేవుడు మన జీవితంలో చేసిన మేలులను బట్టి జాగ్రత్తపడుము, నీవు కన్నులార చూచినవాటిని మరువక యుండునట్లును, అవి నీ జీవితకాల మంతయు నీ హృదయములోనుండి తొలగిపోకుండు నట్లును, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించవలెను. మన దేవుడు క్షమించే వాడు, విమోచించేవాడు, తృప్తిపరిచేవాడు, స్వస్థపరిచేవాడు, పట్టాభిషిక్తునిగా చేసేవాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన చేసిన ఆశీర్వాదములన్నిటిని జ్ఞాపకముచేసుకొని, ఆయన గుణములను బట్టి ఆనందించి ఆయన ఆశ్చర్యకరమైన నామమును నిరంతరం స్తుతిస్తూ నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోనుఆయనను ప్రేమింపవలెను. అప్పుడు మన ప్రతి దోషములను, పాపములను హిమముకంటె తెల్లగా కడిగి, నూతన జీవితాన్ని దయచేస్తాడు.
ప్రార్ధన :
పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమకలిగిన ప్రభువా.. క్షమించే వాడు, విమోచించేవాడు, తృప్తిపరిచేవాడు, స్వస్థపరిచేవాడు, పట్టాభిషిక్తునిగా చేసేవాడు. నీవుచేసిన మేలులను మా తరతరములు ఆశీర్వాదములన్నిటిని జ్ఞాపకముచేసుకొని మా పూర్ణహృదయముతోను మా పూర్ణాత్మతోను మా పూర్ణశక్తితోనుమిమ్మును ప్రేమించి, తద్వారా నీ కృపను పొందుకొనే భాగ్యము మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంటున్నాము మా పరమ తండ్రి... ఆమెన్.
న్యూ లైఫ్ ఇవాంజలికల్ మినిస్ట్రీస్, సనత్ నగర్, హైదరాబాద్
Sunday, 19 January 2020
నిన్ను విడువను అంటున్న నిజమైన స్నేహితుడు
తల్లిదండ్రులు యంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను, తన ఉన్నత చదువు నిమిత్తం కాలేజిలో చేర్పించారు. అప్పటివరకు తలిదండ్రులతో కలసి యంతో ఆనందంగా గడిపిన ఆ అమ్మాయికి కాలేజీలో కొంతమంది స్నేహితులను ఏర్పరచుకొని వారే నా సర్వస్వం, వారే నా ఆనందం అనుకొని తన తండ్రి ఇచ్చిన ప్యాకెట్ మనీ వారికోసం ఖర్చు చేసేది.. సినిమాలకు, షికారులకు, రెస్టారెంటులకు, షాపింగులకు తిరుగుతూ.. ప్రతి దానికి తామే ఖర్చు చేస్తూ.. ఇలా జీవనం కొనసాగిస్తుండగా... తన తండ్రికి ప్రమాదం జరిగింది... హాస్పిటల్ జాయిన్ అయ్యాడు.. వారి కుటుంబములో చాలా కష్టంవచ్చింది, ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడినప్పుడు.. తనదగ్గర డబ్బులు లేక.. స్నేహితులకు ఖర్చుపెట్టకపోయేసరికి వారు ఈమెను దూరంగా పెట్టడం చేసారు. స్నేహితులే సర్వస్వం అనుకొనే తనకు వారు అలా చేసే సరికి తట్టుకోలేకపోయింది. మానసికంగా కృంగిపోయింది. ఆత్మహత్య చేసుకొనే ప్రయత్మచేసి.. హాస్పిటల్ అడ్మిట్ అయింది. తనకు సృహ వచ్చిన వెంటనే నా స్నేహితులు ఎక్కడ అని అడిగినప్పుడు తల్లి ఏడ్చి వాళ్ళు ఎవ్వరూ రాలేదు అని చెప్పినప్పుడు.. ఆ అమ్మాయి కుమిలిపోయింది. "నీ స్నేహితులందరు నిన్ను మరచియున్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు".
"ప్రియా నేస్తమా.. గమనించావా.. నీ దగ్గర ధనం ఉన్నతవరకే నీ స్నేహితులైన, బంధువులైన, నీ కష్టం వచ్చినప్పుడు ఎవ్వరు నీదగ్గరకు రారు. కానీ .. ఎవరు వున్నా లేకున్నా మన దేవుడు తోడుగా ఉంటాడు.. ఒక తల్లిగా, తండ్రిగా, స్నేహితుడిగా... ఈ లోక స్నేహితులు నిన్ను విడిచినా మన దేవుడు ప్రతిక్షణం తోడుగా ఉంటాడుతుంటాడు." తల్లిదండ్రులు విడిచిపెట్టిపోయిన విశ్వాసులకు యెహోవాయే తల్లిగా తండ్రిగా ఉంటాడు. మానవ మాత్రుడెవరికీ సాధ్యపడని విధంగా ఆయన వారిని ప్రేమించి పోషిస్తాడు అని వాక్యము సెలవిస్తున్నది కదా. ఆ చెల్లి స్నేహితులే లోకం అనుకుంది, కానీ తాను నిజమైన స్నేహితుణ్ని తెలుసుకుంది. సంతోషముగా తన జీవనమును కొనసాగిస్తున్నది.
ప్రార్ధన:
పరిశుద్ధుడవైన ప్రియా పరలోకపుతండ్రి.. ఆ చెల్లివలె స్నేహితులే లోకం అనుకొని మోసపోయే వారీగా ఉండకుండా.. నిజమైన స్నేహితుణ్ని తెలుసుకొని మా జీవనమును కొనసాగించుకొనులగునా.. మా పట్ల ఒక తల్లిగా, తండ్రిగా, స్నేహితునిగా ఉంటూ నిత్యము మమ్మును కంటికి రెప్పలా కాపాడుచు.. మమ్మును పోషిస్తున్నందుకు మీకు వందనాలు. దేవా.. నిరతరం నీతోనే స్నేహం చేసేవారిగా ఉండులాగున మమ్మును మమ్ము పట్టుకొని ఉండమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్ధన సమర్పిచుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్.
న్యూ లైఫ్ మినిస్ట్రీస్, సనత్ నగర్, హైదరాబాద్.
Thursday, 16 January 2020
ఎవరు ధన్యులు..
ఒక రోజు చర్చికి వచ్చే ఒక సహోదరుని ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటిలో ఒక అల్మారాలో చాలా పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు ఏంటో చూద్దామని ఒక్కొక్కటి చూస్తున్నాను. ఆ పుస్తకాలు చాలా పద్దతిగా అమర్చి ఉన్నాయి. అందులో చాల భక్తుల చరిత్రలు, ఆధ్యాత్మిక పుస్తకాలు, బైబిళ్ళు కూడా ఉన్నాయి. ఆ బైబిల్ లో ఉన్న వాక్యము ఎంతవరకు ఆ ఇంట్లో ఉన్న వారి హృదయాలలో ఉంది?” నిజమే కదా! ఎన్ని బైబిళ్లు ఉన్నాయి అన్నది ముఖ్యం కాదు, దేవుని వాక్యము ఎంత మన హృదయములో ఉన్నది, ఆ వాక్యము మన మీద ఎంతవరకు ప్రభావము చూపిస్తుంది, ఆ వాక్యము ద్వారా మన జీవితములు దేవునికి ఇష్టముగా ఎంతవరకు మారాయి అన్నది ముఖ్యము. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, అందులో విశ్వాసులకు బైబిలు యాప్ ఉంటుంది. ఈ ఫోన్స్ ద్వారా, ఇంట్లో బైబిళ్లు, సంఘములో వాక్యము, సువార్త సభలు, ఇంకా ఎన్నో రకాల కూడికలు, వీటన్నిటి ద్వారా దేవుని వాక్యము ఈ కాలంలో చాలా అందుబాటులో ఉంది కానీ మనము ఎంతవరకు ఆ వాక్యములో సమయము గడుపుతున్నాము? ఎంతవరకు మన జీవితములను మార్చుకుంటున్నాము?
1.వాక్యము దేవుడే : ఆదియందు వాక్యము దేవుడై ఉండెను అని ఉంటుంది. ఆ వాక్యము యేసుక్రీస్తే. వాక్యము శరీరధారియై మన మధ్యన నివశించెను. దేవుడు మనతో చెప్పాలనుకున్న సత్యము యేసు క్రీస్తు మాటల ద్వారా, ఆయన క్రియల ద్వారా చెప్పారు. ఇంకా చెప్పాలంటే దేవుని మాటలకు, ఆయన ఆలోచనలకు యేసుక్రీస్తు జీవితమునకు ఎటువంటి బేధము లేదు. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు., నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింప బడును.
2.సృష్టికి మూలం వాక్యము: ఈ లోకము మొత్తము కూడా దేవుని యొక్క వాక్కు వలన సృష్టించబడినది. నదులు, సముద్రాలు, పక్షులు, జంతువులు, చెట్లు, గ్రహాలు, నక్షత్రాలు ఇలా అన్నీ కూడా ఆయన వాక్యముతోనే ఇంకా కొనసాగుతున్నాయి. పైన చెప్పినట్లు యేసు క్రీస్తే దేవుని వాక్యము, ఆయనే సమస్తమునకు ఆధారము. కావునా సమస్త సృష్టికి దాని మనుగడకు దేవుని వాక్యమే ఆధారము.
3. వాక్యము రక్షణలోకి నడిపిస్తుంది: దేవుని వాక్యము మనల్ని రక్షణలోనికి నడిపిస్తుంది. అదే వాక్యము ఇప్పటికి అవిశ్వాసులను రక్షణలోకి నడిపిస్తూనే ఉంది, విశ్వాసులను బలపరుస్తూనే ఉంది. ఆ వాక్యము విన్నప్పుడు దానిని స్వీకరించడానికి మన హృదయము సిద్ధముగా ఉండాలి.
4. వాక్యము మనల్ని శుద్ధి చేస్తుంది: యేసు క్రీస్తు మనల్ని రక్షించడానికి సిలువపై తనని తాను అర్పించుకున్నారు. ఆయన రక్తము ద్వారా మనలని విముక్తుల్ని చేశారు. రెండవది, పరిశుద్ధమైనదిగాను, నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను మనల్ని చేయుటకు ఆయన వాక్యము ద్వారా మనల్ని శుద్ధి చేస్తున్నారు.
5. వాక్యము మనము దేవునిలో ఎదగడానికి సహాయం చేస్తుంది: మన శరీరం బ్రతకడానికి ఆహారం, నీరు, గాలి ఎలా అవసరమో, మన ఆత్మీయ జీవితంలో ఎదగడానికి కూడా దేవుని వాక్యము, ప్రార్ధన, సంఘ సహవాసము అంతే అవసరం. శిశువు పుట్టిన తరువాత పాలు త్రాగితేనే బాలుడుగా ఎదుగుతుంది, తరువాత యువకుడుగా, మధ్యవయస్కుడిగా ఇలా ఎదుగుతూ ఉండాలి. శిశువు ఎదగకుండా అలానే ఉండిపోయినా, నెమ్మదిగా ఎదిగినా ఆ శిశువు ఆరోగ్యంగా లేదు అనుకుంటాం. క్రైస్తవ జీవితములో కూడా శిశువులుగానే మనం మిగిలిపోకూడదు. దేవుడు చూపిన మార్గములో జీవిస్తూ ఆత్మీయముగా ఎదిగితేనే దేవుని చిత్తమును నెరవేర్చినవారవుతాం. మన ఆత్మీయ జీవితం ఆరోగ్యముగా ఉండటానికి దేవుని వాక్యం సహాయము చేస్తుంది.
6. వాక్యము మనలో ఉన్న తప్పుల్ని సరిచేస్తుంది: దేవుని వాక్యము రోజూ ధ్యానం చేస్తే మనము తప్పు మార్గంలో ఆలోచిస్తున్నా, దేవుని చిత్తములో జీవించకపోయినా ఆ వాక్యం మనల్ని సరిచేస్తుంది. ఎప్పుడైనా జీవితములో కష్టాలు వస్తే వారు ఎదో పాపం చేస్తున్నారు అందుకే దేవుడు శిక్షిస్తున్నాడు అని చాలా మంది అనుకుంటారు. కానీ దేవుడు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారినే దండిస్తారు అని ఉంటుంది. అంటే మనం కష్టాలు పడటం దేవుడికి ఇష్టం అని కాదు. ఆ కష్ఠాల ద్వారా మనం దేవునికి ఇంకా దగ్గరై ఆయన మార్గం లో నడుస్తాము అని ఆయన కోరిక.
ప్రార్ధన:
పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా... నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని, నీ వాక్యానుసారముగా జీవిస్తూ... బైబిల్ మా అల్మరాలోనూ, చేతులోను అలంకారంగా పెట్టుకోకుండా.. దానిలోని వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉండులాగునా.. మమ్మును సరిచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంటున్నాము మా పరమాతండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్
Tuesday, 14 January 2020
సంపూర్ణ సంతోషము కలుగజేయు స్థలమునకు వెళ్లుదము రండి..
నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. కీర్తనలు 16:11
యేసు సిలువ బాధలను భరిస్తూ ఉన్నప్పుడు ఆనందం ఆయన ముందు ఉంది. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు. ఇది దేవుని సన్నిధి చేరబోతున్నానన్న ఆనందం, దేవుడు ఇచ్చిన పనిని పూర్తి చేస్తున్నానన్న ఆనందం, విశ్వాసులకు తండ్రి ఇంటికి తీసుకువెళ్తున్నానన్న ఆనందం. యేసుకు తెలిసిన జీవమార్గం అక్కడికే తీసుకువెళ్తుంది. ఆ మార్గం ఆయనేయేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు. భూమిపై క్రీస్తు దేవుణ్ణి తన కుడివైపున ఉంచుకున్నాడు. పరలోకంలో దేవుడు ఆయన్ను తన కుడివైపున కూర్చోబెట్టు కున్నాడు. జీవ మార్గాన్ని అనుసరించి దేవుని సన్నిధికి చేరినవారికి శాశ్వత ఆనందం ఉంటుంది. ఇది ఈ లోకంలో తాత్కాలికమైన, వాడిపోయే సుఖభోగాలవల్ల కలిగే సంతోషం లాంటిది కాదు. ఆయన ఆలోచనలూ, మౌనంగా ఉన్న ప్రార్థనలూ, ఆయన ఆశయాలూ, నమ్మకమూ, ఉద్దేశాలూ వెల్లడి అవుతున్నాయి. ఆయనలో నమ్మకముంచే మనందరికీ దీనంతటిలో ఆయనే పరిపూర్ణమైన ఆదర్శం. మహిమకూ నిత్యానందానికీ చేరే విశ్వాస విధేయతల మార్గాన్ని ఆయన చూపించాడు.
ఒకసారి మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో సరిచూసుకుందాము. దేవునితో మనకున్న సాన్నిహిత్యాన్ని పునరుద్ధరించుకోవలసిన సమయమిదే. అపవాది మనం దేవునితో కలిగియున్న సన్నిధిని ఏదోవిధంగా నాశనం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆయన తనతో మనకున్న సన్నిధిని సురక్షితంగా, సుస్థిరంగా ఉండి బలపరచడానికి ప్రణాళికను కలిగియున్నాడు. ఆయన సన్నిధిలో జీవమున్నది, మార్గమున్నది, సంపూర్ణ సంతోషము ఉన్నది. ఆయన హృదయద్వారమునొద్ద నిలుచుని మనలను పిలుచుచున్నాడు. మనం ఆయనను ఆహ్వానిస్తే మనకు ఆ సంపూర్ణ సంతోషము దొరుకుతుంది. మనల్ని మనం సరిచేసుకొని సిద్ధపడుము.
ప్రార్ధన:
పరలోక తండ్రి, ఆదరణ కర్త, ఆలోచన కర్త, నా రక్షకుడా. నా విమోచకుడా.. దయగల దేవా, అద్భుతాలుచేయువాడా.. అన్ని సమయాలలో మతోఉన్న దేవా... నీ అద్వితీయ కుమారుని నా రక్షణకొరకు పంపినందుకు నీకు వందనములు. మమ్మును మేము సరిచేసుకొని నిత్యం నీతో, నీసన్నిధిని కలిగియుండుటకు సహాయం చేయుమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్.
Monday, 13 January 2020
అత్యధికమైన ఆశీర్వాదములను పొందుకొనే శ్రేష్ఠమైన మార్గము ఎంచుకో నేస్తమా...
మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి,......మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎఫెసీ - 3:20
క్రీస్తు మీహృదయములలో విశ్వాసముద్వారా నివసించునట్లుగాను, తన మహిమైశ్వర్యముచొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను. అని ఎఫెస్సి సంఘమునకు పౌలు రాస్తున్నాడు.
క్రైస్తవ జీవితం ఆది నుంచి అంతం వరకు విశ్వాస జీవితమే. క్రీస్తులో అలా నమ్మకం ఉంచుతూ ఉంటే ఆయన మన హృదయాన్ని తన ఇల్లుగా ఎంచి దానంతటిలో ఎలాంటి సంకోచం లేకుండా కాపురం ఉంటాడు. పాపవిముక్తి, రక్షణ విషయంలో మనం ఆయన్ను నమ్మినట్టయితే, మనలో పూర్తిగా నిండి, మన అంతరంగాలను పూర్తిగా ఆవరిస్తాడు విశ్వాసులందరిలోనూ క్రీస్తు ఉన్నాడు. విచారకరమైన సంగతి ఏమిటంటే క్రీస్తు మనలో ఉన్నా మనం ఆయన్ను మన హృదయంలో ఒక మూలన చిన్న గదిలో అతిథిలాగా ఉంచేస్తాము. మన ఇంటికి (హృదయానికి) మనమే యజమానిగా ఉండే ప్రయత్నం చేస్తాము. కానీ మనము అక్కడ నివసిస్తున్న ప్రభువుకు సేవకులుగా ఉండాలి. ఆయనే మన రారాజు. కాబట్టి మన హృదయాలను తన సింహాసనం ఉండే భవనంగా చేసుకోవాలి. దేవుని ఆత్మ మనలో ఉండి మనకు శక్తి ఇచ్చి బలపరిస్తేనే ఇది సాధ్యం.
యేసుప్రభువుకూ విశ్వాసికీ మధ్య సంబంధంలో ప్రేమ అతి ప్రాముఖ్యమైనది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే. క్రీస్తు ప్రేమతో మన జీవితాలను కట్టుకోవలసిన బలమైన పునాది వంటిది.
క్రీస్తు మనలో నిండిపోవడమంటే దేవునితో, పవిత్రాత్మతో నిండిపోవడమే. క్రీస్తు అన్ని ప్రదేశాల్లోని విశ్వాసులందరి హృదయాల్లో ఒకే సమయంలో ఉన్నాడనేది ఆయన దేవుడు అనడానికి రుజువు. కోసం అన్నీ చేసేది దేవుడు కాబట్టి అవి చేసినందుకు ఆయనకే మహిమ కలగడం న్యాయం. అపరిమితమైనవాడు, శాశ్వతుడు, మానవ జ్ఞానానికి అందనివాడు మనదేవుడు, కనుక ఆయన నిత్యము స్తోత్రార్హుడు. దేవుని వాక్యానుసారముగా.. నీవు అడిగినవాటికంటెను.. ఉంహించినవాటికంటెను.. అత్యధికమైన ఆశీర్వాదములను అనుగ్రహించగలిగిన దేవుడు మన యేసయ్య.. ప్రతిదినం ఆయన సన్నిధిలో మోకాళ్లూని విశ్వాసముతో ప్రార్థించినప్పుడు.. నీ ప్రతివిన్నపమును అంగీకరించి... వాక్యము ద్వారా నీతో మాట్లాడుతాడు.
ప్రార్ధన:
మహిమ ఘనత ప్రభావములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి... అడిగినవాటికంటెను.. ఉంహించినవాటికంటెను.. అత్యధికమైన ఆశీర్వాదములను మాకు దయచేస్తున్నందుకు మీకు వందనాలు. ప్రభువా.. నీయందు విశ్వాసముంచి, మమ్మును మా హృదయములో రారాజుగా ఉంచుకొని, ప్రేమకలిగి జీవించులాగునా మమ్మును మీ ఆత్మతో బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంటున్నాము మా పరమ తండ్రి... ఆమెన్ ఆమెన్ ఆమెన్...
Saturday, 11 January 2020
ఏ కార్యమును తలపెట్టినా సమస్తము దేవుని చిత్తానుసారముగా చేద్దాం...
మాటచేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి. కొలస్స - 3:17
మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి. మీరేమి చేసినా ప్రభువైన యేసుద్వారా సమస్తమును ఆయన పేరిట చేయండి అని పౌలు కోలస్సయులకు చెబుతున్నాడు. ఏమిచేసినను సమస్తము ఆయన నామములో చేయాలి (ఆయనకు అపకీర్తి తెచ్చే ఏపని చేయకూడదు). మన జీవితము పూర్తిగా.. ఆయన వాక్యానుసారముగా ఆయన మార్గములో నడుచుకొవాలి.
ఆయనను ప్రేమించే మనమంతా ఈ లోకములో ఆయన రాయబారులమనీ, లేదా ప్రతినిధులమనీ గుర్తించుకోవాలి. ఆయన నామములో ఆయన పనిని చేయడానికి యేసు మనకు పూర్తి అధికారమును ఇచ్చాడు. ప్రతి రాయబారి తన దేశాధ్యక్షుడు పేర ఏ విధముగా తన భాద్యతను నిర్వర్తిస్తాడో... అదే విధముగా క్రీస్తు రాయబారులమైన మనము.. ఆయన ఇచ్చిన భాధ్యతను (మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి.) మనము నిర్వర్తించాలి. ప్రభువైన యేసు పేర ఆయన అధికారం ప్రకారం, ఆయన స్వభావానికి, ఉపదేశాలకు అనుగుణంగా, భూమిపై ఆయన ప్రతినిధులుగా మనం ఇది చెయ్యాలి. మన చర్యలన్నీ మాటలన్నీ ఈ సూత్రాన్ని బట్టే ఉండాలి. ఈ భూమిపై విశ్వాసులు ఆయన ప్రజలు, ఆయన శరీరంలో అవయవాలు. లోకానికి వారే ఆయన్ను కనపరచాలి. తమ ఇష్టం వచ్చినట్టు మాట్లాడ్డానికీ చెయ్యడానికీ కాదు వారిక్కడ ఉన్నది. దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయనవలన నిశ్చయములై యున్నవి.
ప్రార్ధన:
పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి... మేము మాటలతోనైనా గాని.. చేతలతో గాని, చూపులతో గాని.. ఏపాపమును మేము చేయకుండా.. మమ్మును పరిశుద్ధ పరచండి... మేము ఏ కార్యమును తలపెట్టినా నీ చిత్తానుసారముగా చేస్తూ నీకు మహిమకరముగా... జీవించేవారిగా ఉండులాగున సహాయము చేయమని యేసు పరిశుద్ధనామములో అడిగి వేడుకొంటున్నాము మా పరమ తండ్రి.. ఆమెన్.
పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి... మేము మాటలతోనైనా గాని.. చేతలతో గాని, చూపులతో గాని.. ఏపాపమును మేము చేయకుండా.. మమ్మును పరిశుద్ధ పరచండి... మేము ఏ కార్యమును తలపెట్టినా నీ చిత్తానుసారముగా చేస్తూ నీకు మహిమకరముగా... జీవించేవారిగా ఉండులాగున సహాయము చేయమని యేసు పరిశుద్ధనామములో అడిగి వేడుకొంటున్నాము మా పరమ తండ్రి.. ఆమెన్.
Friday, 10 January 2020
దేవుడు మనకు ఇస్తున్న ఆత్మసంబంధమైన ఆశీర్వాదములు
నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నము లన్నిటి లోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ద్వితియో - 28:8
తనపట్ల విధేయులుగా ఉంటే దేవుడు తన ప్రజలను అనేక విధాలుగా దీవిస్తానని మాట ఇచ్చాడు. ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీ ర్వాదమును మనకనుగ్రహించెను. మనము క్రీస్తులో ఉంటే దీవెనలను పొందగలము. ఆయనకు దూరంగా జీవిస్తే ఏ ఆశీర్వాదములను పొందుకోలేము. క్రీస్తులో వుండటం అంటే ఆయనను మన ప్రభువుగా, రక్షకునిగా అంగీకరించి విశ్వాసముతో అయన మార్గమున నడిచినప్పుడు.. ఇహలోక, పరలోక ఆశీర్వాదములను పొందుకుంటాము. దేవుడు మనకు ఆశీర్వాదములను ఇవ్వాలని చూస్తున్నాడు... కానీ అవి పొందుకోనేలా మనము జీవిస్తాలేదు. కాబట్టి క్రీస్తునందు విశ్వాసమును కార్యరూపంలో పెట్టి దేవుడు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదములను సొంతం చేసుకొందాము. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై యుండును, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇహలోకానికి సంబంధించిన దీవెనలకంటే ఎంతో శ్రేష్ఠమైనవి, ప్రధానమైనవి. దేవుడు మనకు ఇస్తున్న ఆత్మసంబంధమైన ఆశీర్వాదములేమిటి? 1. దేవుడు మనలను ఎన్నుకొని కుమారునిగా స్వీకరించాడు. 2. ఆయన ఉచితమైన కృప ద్వారా విమోచన, పాపక్షమాపణను పొందుకొన్నాము. 3. తన చిత్తాన్ని గురించిన మర్మాన్ని మనకు తెలియజేశాడు. 4. సత్య సువార్తను మనకు అనుగ్రహించాడు. 5. పరిశుద్దాత్మ చేత మనలను నింపి ఉంచాడు. ఈ ఆశీర్వాదములను పొందుకొనుటకు క్రీస్తు నందు విశ్వాసముతో ఎదురు చూద్దాము.
బీదలైన మీరు ధన్యులు, దేవునిరాజ్యము మీది. ఈ కాలంలో జీవిస్తున్న విశ్వాసులు పాత ఒడంబడిక సంప్రదాయాన్ని అనుసరించి సంపదలు ఉండడమే దైవాశీర్వాదాలకు గుర్తు అనుకోవడం ఆత్మవంచనే. ధనికులు చాలామంది వారి అపనమ్మకం, అవిధేయతల మూలంగా దేవుని కోపం క్రింద ఉన్నారు. కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును. పేదలనేకమందికీ క్రీస్తులో శాశ్వత భాగ్యాలు ఉన్నాయి.
ప్రార్ధన:
మమ్మును మిక్కిలి ప్రేమతో నిత్యము నీ హస్తాలతో మమ్మును పట్టుకొని నడిపిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రీ ! మేము చేస్తున్న మా ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి, మేము చేస్తున్న ప్రతి ప్రయత్నమును సఫలముచేస్తున్నందుకు మీకు వందనాలు. ప్రభువా.. ఇహలోక ఆశీర్వాదములకన్నా ఆత్మసంబంధమైన ఆశీర్వాదములు బహు శ్రేష్టమైనవి.. దేవా.. నీపై విశ్వాసముంచి ప్రతి ఆశీర్వాదమును పొందుకొనే కృపను మాకు దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్ధన సమర్పిస్తున్నాము మా పరమ తండ్రీ.. ఆమెన్ ఆమెన్ ఆమెన్...
Thursday, 9 January 2020
చెడుతలంపులా ... ఐతే నిన్ను విడిపించేవాడున్నాడు.
ప్రభువు ప్రతి దుష్కార్యమునుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. 2 తిమోతి 4:18.
పౌలు తాను రోమా ఖైదీగా ఉన్న సమయములో తిమోతికి రాసిన చివరి లేఖ. దేవుడు తనను మరణం నుంచి విడిపిస్తాడని అనడం లేదు. తనకు మరణం దగ్గర పడిందని ముందే చెప్పాడు. నేనిప్పుడే పానార్పణముగ పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై యున్నది. కానీ ప్రభువు ఆయన ఇష్టప్రకారం, ఆయనకిష్టమైన సమయంలో తనను చెడునుంచి కాపాడి పరలోకానికి తీసుకువెళ్తాడనే నమ్మకం పౌలుకుంది.
పాపం చెయ్యమని దేవుడు మనుషుల్ని ప్రేరేపించడు. అలా దుష్‌ప్రేరణ కలిగించేది సైతాను మరియు మన స్వంత హృదయాలే. అయితే అలాంటి విషమ పరీక్షలు, దుష్‌ప్రేరేపణలు కలిగే సమయంలో మనల్ని క్షేమంగా ఉంచేందుకు మనం ఆధారపడవలసినది కేవలం దేవుని మీదే. నా ప్రార్థన ధూపమువలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమువలెను నీ దృష్టికి అంగీకారములగును గాక అని దావీదు ప్రార్థనచేసాడు. ఇలాంటి ప్రార్థనలకు జవాబివ్వడం దేవునికి ఎంతో ఇష్టం కాదా. మనం ఈ ప్రార్థన చేయడంలో ఆయనకు ఎప్పుడూ ఉన్న సంకల్పం ప్రకారమే చెయ్యమని ఆయన్ను అడుగుతున్నామన్నమాట. అయితే దుష్‌ప్రేరణలోకి వెళ్ళాలని, రహస్యమైన కోరిక, ఆ ప్రేరణకు లొంగి పాపం చెయ్యాలని మనం ఆశిస్తూ ఉండే వారి ప్రార్థనలకు ఫలితం ఉండదు. శుద్ధ హృదయంతో మనం ప్రార్థన చేసినప్పుడు ఇలాంటి దుష్‌ప్రేరేపణల నుండి మనలను కాపాడుకోగలము. దేవుడు మనల్ని నడిపించే దారిలో పాపం చెయ్యాలన్న ప్రేరణ నుంచి ఆయన మనల్ని కాపాడాలని, భ్రష్ట స్వభావం ఉన్న బలహీనులైన మనలను దుష్‌ప్రేరణలకు గురి అయ్యేందుకు సైతాను చేతులకు అప్పగించవద్దని దేవుణ్ణి ప్రార్ధిద్దాం. మనల్ని దుర్మార్గతనుంచి రక్షించగలిగేది దేవుడొక్కడే అని మనం ఒప్పుకోవాలని, మన స్వంత శక్తి, జ్ఞానంవల్ల మనల్ని మనం రక్షించుకోలేము. బలప్రభావాలంతా, సామర్థ్యమంతా దేవునిదే, ఘనపరచవలసినది ఆయననే, మనము చేయగలిగేది ప్రసాదించు, క్షమించు, రక్షించు అని అడగడం మాత్రమే. ప్రేమమూర్తి అయిన దేవునిపై మనం పూర్తిగా ఆధారపడి ఉండాలి.
ప్రార్ధన:
పరిశుద్ధుడవైన తండ్రీ, ప్రేమ కలిగిన ప్రభువా సైతాను కలిగించే దుష్‌ప్రేరణల నుండి మమ్మును విడిపించండి, పరిశుద్ధ మైన మనస్సుతో దినదినము నీ సన్నిధిలో ప్రార్ధనతో మా హృదయాలను పదిలపరుచుకొని, పౌలు కలిగి ఉన్న నమ్మకమును మేము కలిగి ఉండులాగున, ప్రతి దుష్కార్యమునుండి మమ్మును విడిపించి నీ పరలోక రాజ్యములో చేర్చుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంటున్నాము మా పరమ తండ్రీ .. ఆమెన్ ఆమెన్ ఆమెన్...
Wednesday, 8 January 2020
మధురమైన, తీయనైన మాటలతో నిన్ను బహుగా ఫలింపజేయు.. సర్వోన్నతుడు
నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనెకంటె తీపిగా నున్నవి. - కీర్తనలు 119:103
దేవుని వాక్కును తెలుసుకొని నమ్మి అనుసరించే సాధారణ వ్యక్తికి, అలా చెయ్యని మహా జ్ఞానికంటే మేధావికంటే ఎంతో ఎక్కువ జ్ఞానం ఉంటుంది, ఎందుకంటే అది యెహోవా పట్ల భయ భక్తులు అతనికి జ్ఞానం నేర్పుతుంది. దేవుని వాక్కును స్వీకరించడం వల్ల కలిగే ఫలితాలు - ఆనందం, మన జీవితములో వెలుగు.
ఒక మనిషి జీవితంలో శాశ్వతమైన మేలు కలిగేందుకు దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించి, దేవుని ఉపదేశాల్లో ఉన్న పవిత్ర మైన, న్యాయబద్దమైన, మేలుకరమైన మార్గములు అనుసరించినప్పుడు ఆయన కృపను, సమాధానమును పొందుకుంటారు. అందుకే కీర్తనకారుడు 19వ కీర్తనలో దేవుని వాక్కు బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనెకంటెను జుంటితేనెధారలకంటెను మధురమైనవి. అని దేవుని వాక్కులో ఉన్న మాధుర్యమును తెలియజేస్తున్నాడు. "నా కుమారుడా, తేనె త్రాగుము అది రుచిగలది గదా తేనెపట్టు తినుము అది నీ నాలుకకు తీపియే గదా, నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలిసికొనుము అది నీకు దొరికినయెడల ముందుకు నీకు మంచిగతి కలుగును నీ ఆశ భంగము కానేరదు." (సామెతలు 24 :13, 14) అని దేవుని వాక్యము తెలియజేస్తున్నది.
దేవుని వాక్యము ధ్యానించి దాని యొక్క విలువను తెలుసుకొన్న వ్యక్తి దానిలోని మాధుర్యమును పొందుకొంటాడు. మన ఆపదలనుండి దేవుడు మనకు విడుదల కలిగిస్తాడన్న సత్యమును దేవుని వాక్యము బయలుపరచినప్పుడు అది మన మానసిక జీవితమునకు తీయ్యగా ఉంటుంది. మన జీవితములో దేవుడు ఎలా అద్భుతమైన ప్రణాలికను ఎలా జరిగించుచున్నాడన్న సత్యమును మనము చూచినప్పుడు అది మన ఆత్మీయగ్రహింపునకు తీయ్యగా ఉంటుంది. విశ్వసియొక్క జీవితములో గ్రహింపునకు, పరిపక్వతకు, ఫలించుటకు మరియు మన జీవనశైలికి దేవుని వాక్యము ఎంతో ముఖ్యమైంది.
ప్రార్ధన:
పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమకలిగిన ప్రభువా, నీ వాక్యంలోని మాధుర్యమును గ్రహించి, జుంటే తేనెకంటె తీయనైన జీవితమును మాకు దయచేయండి. నీవిచ్చిన ప్రతి మాటను చదివి, ధ్యానించి, వాక్యానుసారముగా జీవించే భాగ్యమును మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంటున్నాము మా పరమ తండ్రి... ఆమెన్.
న్యూ లైఫ్ మినిస్ట్రీస్, హైదరాబాద్
Tuesday, 7 January 2020
నూతన జీవితమునకు సరైన మార్గము.. తెలుసుకో మిత్రమా...
ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను; 2 కొరింథీ 5 :17.
ఈ నూతన సంవత్సరములో దేవుడు నీతోను నాతోనూ మాటలాడుచున్నాడు..
శరీరము పాపము, కళ్ళతో పాపము, చేతులతో పాపము, నోటితో పాపము చేస్తూ ఎవరితోనూ సమాధానము లేకుండా జీవిస్తున్నావేమో.. ఇప్పటివరకు జీవిస్తున్న మన పాత రోత జీవితంను వదిలేసి, యేసు క్రీస్తును మన హృదయాలలోనికి ఆహ్వానించి నూతన జీవితం వైపు పరుగులు తీద్దాం... మనము క్రీస్తునందున్న యెడల, క్రీస్తు మనయందుండును, మరియు మనలో జీవించు ఆయన పరిశుద్దాత్మ ద్వారా మనము నూతన సృష్టి అగుదుము. మనము క్రీస్తు నందు నూతన సృష్టి అయితే నీ పాత పాపసంబంధపు కోరికలు, అలవాట్లు విడిచిపెట్టాలి. మనము నూతన హృదయమును పొందుకోవాలి. మనము వసంతకాలపు చిగురువేసే చెట్టులా మారి నిరంతరం చిగురిస్తూ ఉండాలి.. ఆ చిగురు మన యేసు అయి ఉండాలి అప్పుడు నీవు వాడిపోవు.. ఎండిపోవు.. రాలిపోవు.
మునుపటివాటిని జ్ఞాపకము చేసికొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. కాబట్టి ఈ నూతన సంవత్సరము దేవుని వాక్యానుసారముగా.. జీవిస్తూ.. క్రీస్తు మార్గములో నడుస్తూ.. సాధ్యమైనంత వరకు ప్రతిఒక్కరితో ప్రేమ, సమాధానము కలిగి జీవిస్తూ.. గతమును విడచి నూతన జీవితమును జీవించుటకు.. తీర్మానమును తీసుకొందాము.. దేవుడు మిమ్ములను సకల ఆశీర్వాదములతో దీవించును గాకా! ఆమెన్.. ఆమెన్... ఆమెన్...
ప్రార్ధన:
మహిమ ఘనత ప్రభావములు కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రీ ... మమ్మును యంతగానో ప్రేమించి, మా పాపపు బ్రతుకునుండి విడిపించి మాకు నూతన జీవితము ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు... ప్రభువా.. నా పాత, రోత జీవితంవైపు నేను మరలకుండా.. నీ కృపా కటాక్షములను మాకు దయచేయమని యేసు పరిశుద్ధనామములో అడిగి వేడుకొంటున్నాను మా పరమ తండ్రీ .. ఆమెన్... ఆమెన్... ఆమెన్..
Monday, 6 January 2020
విజయమును, ఆశీర్వాదమును పొందుకోవాలా..
నీవు ఆశీర్వాదము పొందుదువు గాక; నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక. 1 సమూ 26:25
ఈ ఆశీర్వాదమును శత్రువు అయిన సౌలు నుంచి దావీదు పొందుకున్నాడు. దావీదుకు సౌలును చంపే అవకాశము వచ్చినా, యెహోవాచే అభిషేకం పొందిన అతనిని వదిలేసాడు..దావీదు గొప్పతనాన్ని సౌలు కూడా ఒప్పుకోవలసి వచ్చింది. తరువాత సౌలు, దావీదు తిరిగి కలుసుకోలేదు. దావీదు తాను పరిపాలించినంతకాలం దేవుడు తనకు శత్రువులందరిని తన పాదముల క్రింద ఉండులా చేసి, సొలొమోను కాలం నాటికి తన రాజ్యములో శత్రువులే లేకుండా చేసాడు.
నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము వాడు తొట్రిల్లినప్పుడు నీవు మనస్సున నుల్లసింపకుము.మన శత్రువు మన చేతికి చిక్కినప్పటికీ వారికి అపకారము చేయక కష్టాలలో ఉన్నవారికి నీ వంతు ఉపకారము చేసినప్పుడు నీవు కూడా ఆశీర్వదించబడతావు. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి అని యేసు క్రీస్తు సెలవిచ్చారు. నీ పగవాడు ఆకలిగొనినయెడల వానికి భోజనము పెట్టుము దప్పిగొనినయెడల వానికి దాహమిమ్ము. యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును. ఈ విధముగా చేసిన యెడల నీ శత్రువు కూడా నిన్ను ప్రేమించును, నిన్ను గౌరవించును.
ప్రార్ధన:
మహిమ ఘనత ప్రభావము కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రీ... దావీదు వలే మేము కూడా శత్రువును ప్రేమించేవారిగా ఉండులాగున, తద్వారా నీ కృప ఆశీర్వాదములు పొందుకొనే వారిగా, నిత్యము నీ సన్నిధి మావెంట పెట్టుకొని, ప్రతి పనిలోనూ విజయమును పొందుకొనే భాగ్యమును మాకు దయచేయమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్ధన సమర్పించుకొంటున్నాము మా పరమ తండ్రీ ... ఆమెన్... ఆమెన్... ఆమెన్...
Sunday, 5 January 2020
నీకు ఏ లోటు రాకుండా నడిపించు కాపరి...
యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయు చున్నాడుశాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు. కీర్తనలు 23:1,2
గొర్రెలను కాచే ఒక బాలుడిగా దావీదు తాను వ్యక్తిగత అనుభవం కలిగినవాడై , తనను తాను గొర్రెగా భావించుకొన్నాడు. యెహోవా తన కాపరిగా తనపట్ల చేసిన సమాధానమును, సంతోషమును అనుభవిస్తున్నాడు. నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని అని యేసు క్రీస్తు వారు అన్నారు. మనము ఆయన వెలయిచ్చి కొన్నగొఱ్ఱెలమై ఉన్నాము. మన కాపరి మనకు కొదువ లేకుండా అన్నీ ఇస్తాడు మనం సందేహించవలసిన పనిలేదు. మనం కోరుకున్నవన్నీ ఆయన ఇవ్వకపోవచ్చు గాని, ఆయనను అనుసరించి, ఆయనపై విశ్వాసముంచినప్పుడు మనకు అవసరమైనవన్నీ ఇస్తాడు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పు డవన్నియు (ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతోషము, సమాధానము, గర్భఫలము, ఉద్యోగము, వ్యాపారము) మీకనుగ్రహింపబడును. అన్నిటిలోనూ దేవునికే ప్రథమ స్థానం ఇచ్చినవారు, దేవుడే తమ గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడనీ తమ అవసరాలన్నీ తీరుస్తున్నాడనీ తెలుసుకుంటారు. మంచి కాపరి గొర్రెలను తోలడు గాని అవి వెళ్ళవలసిన చోటికి తాను ముందుండి తీసుకువెళ్తాడు. క్రీస్తు తన ప్రజలను భూమినుంచి పరలోకానికి నడిపిస్తాడు. వారు వెయ్యవలసిన ప్రతి అడుగూ ఆయనకు తెలుసు, ఎందుకంటే వారికి సంభవించబోయే ప్రతిదాని విషయంలోనూ ఆయన వారికి ముందుగా వెళ్లుచున్నాడు.
ప్రార్ధన:
పరిశుద్ధుడవైన తండ్రీ, ప్రేమ కృప సమాధానము గల దేవా.. నీవు మా కాపరిగా ఉన్నందుకు నీకు వందనాలు.. ప్రభువా నీ పైన విశ్వాసముంచుచున్నాము.. మాకు ఏ లోటు లేకుండా మా ముందుండి మమ్మును నడిపిస్తున్న విధానమును బట్టి మీకు వందనాలు. ప్రభువా... నేను బ్రతుకు దినములన్నియు నిన్ను వెంబడించేవారిగా ఉండులాగున మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధనామములో అడిగి వేడుకొంటున్నాము మా పరమ తండ్రీ.. ఆమెన్.. ఆమెన్.. ఆమెన్...
Saturday, 4 January 2020
పరలోక రాజ్యము స్వతంత్రించుకొనే సులువైన మార్గము !!
శిష్యులు వారికి మార్గము తెలియదన్నప్పుడు.. యేసు నేనే మార్గమును అని వారితో చెప్పెను. ఎందుకంటే పరలోకములో ప్రవేశించడానికి ఆయన మార్గమునై ఉన్నాడు. ఆయన సిలువ మరణం ద్వారా మన పాపములు క్షమించబడ్డాయి... అంతే కాదు దేవుని దృష్టిలో మనము నీతిమంతులుగా యెంచబడ్డాము. విశ్వాసము వలన మనము పొందే యేసు నీతి మనకు పరలోకం వెళ్ళడానికి అధికార పత్రమవుతోంది.
ఆయన సత్యమైన దేవుడు.. ఆయనయందు విశ్వాసముంచి ఆయన బోధను ఒప్పుకొని మనము రక్షణను పొందుకొని, అజ్ఞానము నుండి, పాపమునుడి విడుదల పొందుకొంటాము
ఆయనలో జీవమున్నది. ఆయన నిరంతరం జీవించు వాడు.. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యేసు మాత్రమే లోకమునకు రక్షకుడు. యేసునందు విశ్వాసముంచుట వలన మాత్రమే మనము తండ్రి యొద్దకు రాగము. ఆయన ఇంటిలో నివసింపగలము.
నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పగలిగిన ఏకైక దేవుడు ఒక క్రీస్తు మాత్రమే ఈయన మాత్రమే మనుస్యులకు రక్షణ, నిత్యమార్గము ఇవ్వగలడు, వారిని పరలోకమునకు నడిపించగలడు. మార్గము, సత్యము, జీవమునై ఉన్న క్రీస్తును ఈ రోజు నుంచే వెంబడిద్దాము.. పరలోక రాజ్యమునకు మార్గము సరాళము చేసుకుందాము.
ప్రార్ధన :
పరిశుద్ధుడవైన మా ప్రియా పరలోకపు తండ్రి.. నీ ప్రియా కుమారుని మా కొరకు ఈ భూలోకమునకు పంపించి సర్వమానవాళి పాపముల నుండి విడిపించుట కొరకు తన ప్రాణము బలిగా అర్పించి.. మమ్మును రక్షించినందుకు మీకు వందనాలు.. దేవా.. నీవిచ్చిన రక్షణను, నిత్యమార్గములో జీవిస్తూ.. మార్గము, సత్యము, జీవము అయిన యేసు దివ్యమైన నామములో ఈ ప్రార్ధన సమర్పించు చున్నాము మా పరమ తండ్రీ...
ఆమెన్.... ఆమెన్.... ఆమెన్ ....
దేవుడు నిత్యము మిమ్మును కృపాక్షేమములతో నింపును గాకా!!!
Friday, 3 January 2020
దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడో తెలుసా...
నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను. యిర్మియా 31:3
ఈ లోకములో అనేకమంది నిన్ను ప్రేమించి ఉండవచ్చు.. పుట్టినప్పటినుండి తల్లిదండ్రుల ప్రేమ, తోబుట్టువుల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ ఇవన్నీ కొంత కాలమే... కానీ మన పరలోక తండ్రి ప్రేమ మాత్రం నీవు గర్భములో రూపింపక ముందే నిన్నెరిగి మనము బ్రతుకు దినములన్నియు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ.. ఎన్నడును విడువక నిత్యము మనయెడల కృపనుచూపుతున్నాడు. అటువంటి దేవునికి మనము ఏమియ్యగలము.. ఇప్పటివరకు మన బ్రతుకు ఎలా ఉన్న సరే గాని.. ఇప్పటినుండి మాత్రం ఇహలోకమాలిన్యము నీకు అంటకుండ నిను నీవు కాపాడుకొనుచూ, నిన్ను ప్రేమిస్తున్న దేవుని యొద్దకు వచ్చి ప్రతిపాపమును ఆయన ఎదుట ఒప్పుకొని, నిష్కలంకమైన హృదయముతో దేవునికి ప్రార్ధన చేయాలి. ఆయన వాక్యమును అనుదినం ధ్యానిస్తూ, ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ మన హృదయాలను దేవునికి అర్పించాలీ. మన హృదయాల్లో చల్లిన దేవుని వాక్కు పంటకు రావాలంటే అణుకువతో నమ్మకంతో దాన్ని అంగీకరించాలి. దానికి లోబడి దాన్ని మనలో పని చేయనివ్వాలి. హృదయంలో దేవుని వాక్కుకు మనల్ని మార్చి రక్షించే శక్తి ఉంది.
ప్రార్ధన:
పరిశుద్ధుడవైన తండ్రి పేమ కలిగిన ప్రభువా... గర్భములో రూపింపక ముందే నన్నెరిగిన దేవుడవు, శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించు చున్నావు.. విడువక నా యెడల కృపను చూపుచున్నావు.. ప్రభువా.. నా ప్రతిపాపమును, దోషములను నీ ఎదుట ఒప్పుకొంటున్నాను.. నన్ను క్షమించి నీ రక్షణ భాగ్యమును మాకు ఇచ్చి ఇంకెన్నడు ఈ ఇహలోక మాలిన్యము మాకు అంటకుండా ప్రతిదినం మమ్మును హిమము కంటే తెల్లగా మమ్మును మార్చమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంటున్నాము మా పరమ తండ్రి.. ఆమెన్.. ఆమెన్.. ఆమెన్..
Thursday, 2 January 2020
కృప సమాధానము ఎక్కడి నుంచి వస్తుంది
మన తండ్రియగు దేవునినుండియు ప్రభువగు యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక. ఫిలిప్పీ - 1:2
పౌలు గారు ఫిలిప్పులో ఉన్న సంఘమునకు ప్రేమతో శుభములు తెలియజేస్తూ.. దయ మరియు శాంతి కలిగి జీవించుడి అని చెప్పుచున్నాడు. దయ మోక్షానికి ఆధారం మరియు క్రైస్తవ జీవన ప్రమాణం. శాంతి ఆత్మ యొక్క ఫలంలో భాగం మరియు క్రైస్తవ జీవనానికి ముఖ్యమైన లక్షణం అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి విశ్వాసుల ఆత్మఫలమే కాదు గాని విశ్వాసిలో దేవుని ఆత్మ ఫలింపజేసిన ఫలం.వాక్యానుసారముగా జీవించాలి, క్రీస్తు అడుగు జాడలలో నడుచు కోవాలి. అలా కాకుంటే అతని జీవితంలో ఈ ఫలం కనిపించదు. ఫలం అనే మాట కాలక్రమేణా జరుగుతున్న అభివృద్ధిని సూచిస్తున్నది. ఆ ఫలం కలిగి జీవించినప్పుడుప్రార్ధన :
మన తండ్రి అయిన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తుపై మన సంపూర్ణ దృష్టి పెట్టగలము. దయ మరియు శాంతి రెండూ తండ్రి మరియు కుమారుడి నుండి వచ్చాయి. పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధి కారము ఇయ్యబడియున్నది అని సాక్షాత్తు యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. కాబట్టి సాధ్యమైనతవరకు.. ప్రతి ఒక్కరితో సమాధానమును.. శాంతిని కలిగి జీవిద్దాం... దేవుని కృపను పొందుకుందాము.
మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికిని కృప కలుగును గాక. ఆమెన్.. ఆమెన్.. ఆమెన్..
పరిశుద్ధుడవైన తండ్రీ ... ప్రేమకలిగిన ప్రభువా.. నీవు మాకు ఇచ్చినా శాంతి సమాధానములతో ఇతరులపట్ల మెలిగే వారిగా ఉండులాగునా.. ప్రతిఒక్కరితో సమాధానపడి జీవించే వారీగా ఉండులాగున, మీ కృప నిత్యమూ మా పట్ల ఉండులాగున మమ్మును మలచమని ... యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్ధన సమర్పించుకొంటున్నాను మా పరమ తండ్రి... ఆమెన్.
Wednesday, 1 January 2020
పాపానికి దూరంగా ఉండాలంటే... ఏమిచెయ్యాలి ?
నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను. - కీర్తనలు 119:11
పాపము మరియు దాని ప్రలోభములను ఎదుర్కొనుటకు దేవుని వాక్యము మనకు బలమునిచ్చి పాపక్రియలనుంచి కాపాడుతుంది, మనకు ఒప్పుదలను కలుగజేసి పరిశుద్దాత్మ సహాయముతో మన జీవన శైలి మార్చుకొని, పాపపు ఇచ్చలకు దూరముగా ఉండి, మన మాటల ద్వారా.. క్రియల ద్వారా దేవుణ్ణి ఘనపరుస్తూ ఆయనను మహిమపరిచే విధముగా మనలను మలుస్తున్నది దేవుని వాక్యము."సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము నీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి.
నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహో వాను ప్రేమింపవలెను. మాటచేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి." అని దేవుని వాక్యము సెలవిస్తున్నిది. దేవుని వాక్యము మనలో ఉన్నప్పుడు ఏ పాపమూ మనకు అంటదు.
ప్రార్ధన:
నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహో వాను ప్రేమింపవలెను. మాటచేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి." అని దేవుని వాక్యము సెలవిస్తున్నిది. దేవుని వాక్యము మనలో ఉన్నప్పుడు ఏ పాపమూ మనకు అంటదు.
ప్రార్ధన:
పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమకలిగిన ప్రభువా, నీ వాక్యము నా హృదయమును కడిగి, నా జీవితమును మార్చుటకు శక్తి కలదని నమ్మి నీ వాక్యము కొరకు నీ సన్నిధికి వచ్చెదనని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంటున్నాము మా పరమ తండ్రి... ఆమెన్.
న్యూ లైఫ్ మినిస్ట్రీస్, హైదరాబాద్
Subscribe to:
Comments (Atom)
2025 కి గుడ్ బై చెప్పి... ఇ క నూతన ఉత్సాహముతో 2026 లోకి అడుగు వేద్దాం సంవత్సరాంతంలో (Year-end) మనం గడిచిన రోజులను నెమరువేసుకుంటూ, కొత్త ...
-
ఆయన శాసనములను గైకొనుచు పూర్ణహృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. -కీర్తనలు 119 :2 ఒక రోజు చర్చికి వచ్చే ఒక సహోదరుని ఇంటికి వెళ్ళినప్పుడు ...
-
2025 కి గుడ్ బై చెప్పి... ఇ క నూతన ఉత్సాహముతో 2026 లోకి అడుగు వేద్దాం సంవత్సరాంతంలో (Year-end) మనం గడిచిన రోజులను నెమరువేసుకుంటూ, కొత్త ...
-
ప్రభువు ప్రతి దుష్కార్యమునుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును . 2 తిమోతి 4:18. పౌలు తాను రోమా ఖైదీగా ఉన్...















