Sunday, 19 January 2020

నిన్ను విడువను అంటున్న నిజమైన స్నేహితుడు

నీ స్నేహితులందరు నిన్ను మరచియున్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. - యిర్మియా 30:14
తల్లిదండ్రులు యంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను, తన ఉన్నత చదువు నిమిత్తం కాలేజిలో చేర్పించారు. అప్పటివరకు తలిదండ్రులతో కలసి యంతో ఆనందంగా గడిపిన ఆ అమ్మాయికి కాలేజీలో కొంతమంది స్నేహితులను ఏర్పరచుకొని వారే నా సర్వస్వం, వారే నా ఆనందం అనుకొని తన తండ్రి ఇచ్చిన ప్యాకెట్ మనీ వారికోసం ఖర్చు చేసేది.. సినిమాలకు, షికారులకు, రెస్టారెంటులకు, షాపింగులకు  తిరుగుతూ.. ప్రతి దానికి తామే ఖర్చు చేస్తూ.. ఇలా జీవనం కొనసాగిస్తుండగా... తన తండ్రికి ప్రమాదం జరిగింది...  హాస్పిటల్ జాయిన్ అయ్యాడు.. వారి కుటుంబములో చాలా కష్టంవచ్చింది, ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడినప్పుడు.. తనదగ్గర డబ్బులు లేక.. స్నేహితులకు ఖర్చుపెట్టకపోయేసరికి వారు ఈమెను దూరంగా పెట్టడం చేసారు. స్నేహితులే సర్వస్వం అనుకొనే తనకు వారు అలా చేసే సరికి తట్టుకోలేకపోయింది.  మానసికంగా కృంగిపోయింది. ఆత్మహత్య చేసుకొనే ప్రయత్మచేసి.. హాస్పిటల్ అడ్మిట్  అయింది.  తనకు సృహ వచ్చిన వెంటనే నా స్నేహితులు ఎక్కడ అని అడిగినప్పుడు తల్లి ఏడ్చి వాళ్ళు ఎవ్వరూ  రాలేదు అని చెప్పినప్పుడు.. ఆ అమ్మాయి కుమిలిపోయింది. "నీ స్నేహితులందరు నిన్ను మరచియున్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు".
"ప్రియా నేస్తమా.. గమనించావా.. నీ దగ్గర ధనం ఉన్నతవరకే నీ స్నేహితులైన, బంధువులైన, నీ కష్టం వచ్చినప్పుడు ఎవ్వరు నీదగ్గరకు రారు. కానీ .. ఎవరు వున్నా లేకున్నా మన దేవుడు తోడుగా ఉంటాడు.. ఒక తల్లిగా, తండ్రిగా, స్నేహితుడిగా... ఈ లోక స్నేహితులు నిన్ను విడిచినా మన దేవుడు ప్రతిక్షణం తోడుగా ఉంటాడుతుంటాడు." తల్లిదండ్రులు విడిచిపెట్టిపోయిన విశ్వాసులకు యెహోవాయే తల్లిగా తండ్రిగా ఉంటాడు. మానవ మాత్రుడెవరికీ సాధ్యపడని విధంగా ఆయన వారిని ప్రేమించి పోషిస్తాడు అని వాక్యము సెలవిస్తున్నది కదా.  ఆ చెల్లి స్నేహితులే లోకం అనుకుంది, కానీ తాను నిజమైన స్నేహితుణ్ని తెలుసుకుంది.  సంతోషముగా తన జీవనమును కొనసాగిస్తున్నది. 

ప్రార్ధన: 

పరిశుద్ధుడవైన ప్రియా పరలోకపుతండ్రి.. ఆ చెల్లివలె స్నేహితులే లోకం అనుకొని మోసపోయే వారీగా ఉండకుండా.. నిజమైన స్నేహితుణ్ని తెలుసుకొని మా జీవనమును కొనసాగించుకొనులగునా.. మా పట్ల ఒక తల్లిగా, తండ్రిగా, స్నేహితునిగా ఉంటూ నిత్యము మమ్మును కంటికి రెప్పలా కాపాడుచు.. మమ్మును పోషిస్తున్నందుకు మీకు వందనాలు. దేవా.. నిరతరం నీతోనే స్నేహం చేసేవారిగా ఉండులాగున మమ్మును మమ్ము పట్టుకొని ఉండమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్ధన సమర్పిచుచున్నాము మా పరమ తండ్రి.  ఆమెన్.  

న్యూ లైఫ్ మినిస్ట్రీస్, సనత్ నగర్, హైదరాబాద్.  

No comments:

Post a Comment

 2025 కి గుడ్ బై చెప్పి...  ఇ క నూతన ఉత్సాహముతో  2026 లోకి  అడుగు వేద్దాం సంవత్సరాంతంలో (Year-end) మనం గడిచిన రోజులను నెమరువేసుకుంటూ, కొత్త ...