Sunday, 14 June 2020



దేవునికి సమీపముగా నడుచుకోవడం అలవర్చుకో...
"దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రముచేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. " యాకోబు 4:8
మన అంతరంగములో ప్రభువునకు సమీపముగా  ఉన్నపుడు ఆయన మన సమీపముగా ఉంటాడు, దేవుని పరిశుద్దాత్మ మనలో నివసిస్తాడు.  దేవునితో దగ్గరగా  జీవించడమంటే..ఆయనను కీర్తనలతో  స్తుతించడం,  ఆయన వాక్యమును ధ్యానించడం,  ప్రార్ధనద్వారా ఆయనతో మాట్లాడటం , అనుకూలసమయమున దేవునితో గడపడం చేసినప్పుడు దేవుడు మనకు సమీపముగా ఉంటాడు.
నీ దినమంతటిలో చేసిన ప్రతి విషయమును దేవునితో పంచుకుని.. మనము చేసిన పాపములను ఆయన ఎదుట ఒప్పుకొని, మన  హృదయమును పరిశుద్ధపరచుకొని, ఆయన చేసిన మేలులను బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లించడం మనకు ఎంతో శ్రేయస్కరము. మనము ఎక్కడికి వెళ్లిన, ఏ పరిస్థితులో ఉన్న దేవున్ని స్తుతించడం మాత్రం మానవద్దు. ఈ కార్యములను నీవు ఎంత ఎక్కువగా చేస్తావో దేవుడు నీకు అంత సమీపముగా ఉంటాడు. ఏ పాపము అంటకుండా నిన్ను ఎత్తి పట్టుకుంటాడు. 
యేసేపు నిత్యము దేవునితో ఉన్నాడు కాబట్టే పోతీఫర్ భార్య పాపము చేద్దామని ప్రేరేపించినా లోబడక ఆ పాపమునుండి దూరముగా పారిపోయాడు. (ఆది - 39:7-16)  దేవుడు యేసేపునకు సమీపముగా ఉన్నాడు కాబట్టి ఏపాపమునకు చోటు ఇవ్వలేదు. 
ఈ సమయములో దేవుడు నీ సమీపముగా ఉండటానికి.. యేసేపువలె ఆయనకు నీ హృదయములో చోటు ఇస్తావా...?
న్యూ లైఫ్ మినిస్ట్రీస్, సనత్ నగర్, హైదరాబాద్ - 500018. 
మీ ప్రార్ధనావసరతలకు :  9010302558

No comments:

Post a Comment

 2025 కి గుడ్ బై చెప్పి...  ఇ క నూతన ఉత్సాహముతో  2026 లోకి  అడుగు వేద్దాం సంవత్సరాంతంలో (Year-end) మనం గడిచిన రోజులను నెమరువేసుకుంటూ, కొత్త ...